కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి  నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దు కొనసాగుతోంది. తాజాగా జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు గడువును పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది. డీజిసీఏ ( Directorate General Of Civil Aviation ) ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసులు ఎంపిక చేసుకున్న మార్గాల్లో మాత్రం కొనసాగుతాయి అని పౌర విమానయాన శాఖ ( Civil Aviation Ministry ) తెలిపింది. దీంతో పాటు కార్గో విమానాల ( Cargo Flights ) సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు అని ప్రకటించింది. ప్రత్యేక సందర్భాల్లో డీజిసిఏ అనుమతి ఇచ్చిన విమానాలకు కూడా మినహాయింపు ఉన్నట్టు స్పష్టం చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి భారత్‌కు రప్పించడానికి ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ ( Vande Bharat Mission ) కొనసాగనుంది అని కూడా తెలియజేసింది. మే 6న ప్రారంభం అయిన వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 4 లక్షల 75 వేల మంది భారతీయులు దేశానికి తిరిగి వచ్చారు. 


Also Read :  Chingari App: డౌన్‌లోడ్స్‌లో దుమ్మురేపుతోన్న చింగారి యాప్